యంగ్ హీరో కు జోడిగా అనుపమా !

Published on Feb 23, 2019 9:45 am IST

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రాక్షసన్ రీమేక్ లో నటించనున్నాడని తెలిసిందే. రైడ్ ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇటీవల ఈచిత్రం అధికారికంగా లాంచ్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించనుంది.

హలో గురు ప్రేమ కోసమే తరువాత తెలుగులో ప్రస్తుతం అనుపమా ఈ సినిమాకి మాత్రమే సైన్ చేసింది. గిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :