“హాయ్ నాన్న” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

“హాయ్ నాన్న” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 1, 2024 4:30 PM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో బేబీ కియారా కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ జెమిని టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 17, 2024 న జెమిని టీవీ లో ప్రసారం కానుంది. సాయంత్రం 6:00 గంటలకు ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. హేషం అబ్ధుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు