సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..!

Published on Dec 1, 2021 11:30 pm IST


సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అఖండ, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప వంటి బడ్జెట్‌ సినిమాలకు ధరలఅను పెంచుతామని థియేటర్ల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి.

అంతేకాదు ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. కాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత సమాచారం :