రవితేజ ‘రావణాసుర’ హిందీ వర్షన్ ఆ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారం

Published on May 15, 2023 10:02 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రావణాసుర. ఈ సినిమాలో సుశాంత్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ, జయరామ్, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలో సంగీతం అందించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ మరియు రవితేజ టీమ్‌వర్క్స్ గ్రాండ్ గా నిర్మించాయి.

అయితే మొదటి నుండి అందరి అంచనాలు ఏర్పరిచిన రావణాసుర మూవీ రిలీజ్ అనంతరం ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఇటీవల ఈ మూవీ ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీని హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు అమెజాన్ ప్రైమ్ వారు. ఈమేరకు తాజాగా ప్రకటన వచ్చింది. మరి తెలుగు, తమిళ ఆడియన్స్ ని ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ మూవీ, ఎంతవరకు హిందీ ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :