సినిమా అందమైన అబద్దాన్ని నిజంలా చూపిస్తుంది. హృదయాన్ని పిండేసే నిజాన్ని కూడా నిక్కచ్చిగా చూపిస్తుంది. సినిమాతో చేయనిది అంటూ దాదాపు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాతో కాలంలో ముందుకూ తీసుకెళ్తుంది వెనక్కీ తీసుకెళ్తుంది తెలిసిన తెలియని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. మరి అలాంటి సినిమా పరిశ్రమలో అది కూడా మన దగ్గర ఒక చాలా ప్రత్యేకమైన తేదీ ఉంది, అదే మే 9.
అయితే ముఖ్యంగా ఈ తేదీ మన తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్య పాత్రనే పోషించింది అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదలు కొని ఈ డేట్ లో భారీ రికార్డులు ఇండస్ట్రీ హిట్ లు ఉన్నాయి. మెగాస్టార్ నటించిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” అలాగే “గ్యాంగ్ లీడర్” అనే సినిమాలతో వరుస ఏడాదిలలో రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు.
ఇక ఈ తేదిలోనే వచ్చిన వెంకీ మామ “ప్రేమించుకుందాం రా”, కింగ్ నాగ్ “సంతోషం” అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) “మహర్షి” లాంటి భారీ హిట్స్ ఈ తేదీన మార్క్ అయ్యాయి. ఇక వీటితో పాటుగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “మహానటి” కూడా సంచలన విజయాన్ని అందుకొని తెలుగు సినిమా హిస్టరీలో మరో స్పెషల్ సినిమాకి గుర్తుగా నిలిచింది.
ఇక వీటితో పాటుగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ (Director Shankar), యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్ లో వచ్చిన తమిళ సినిమా గేమ్ ఛేంజింగ్ చిత్రం “ఇండియన్” కూడా ఇదే తేదీన రిలీజ్ కావడం విశేషం కాగా శంకర్ కూడా నేడు ఈ స్పెషల్ డే కి ఇండియన్, ఇండియన్ 2 (Indian 2) పోస్టర్ కలిపి గుర్తు చేసుకున్నారు. అయితే సరిగ్గా ఇదే స్పెషల్ డే కి మన తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి మరోసారి చూపించే సినిమా రావాల్సి ఉంది.
ఆ సినిమానే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD). మన తెలుగు సినిమాకి గతం నుంచి ప్రస్తుత కాలానికి అప్పుడు నుంచి భవిష్యత్తుకి ఓ రేంజ్ లోకి మారిన ఈ తేదీన అదే కాల ప్రయాణం కాన్సెప్ట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్, అలాగే దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ ల కలయికలో తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణం రీత్యా సినిమా ఈ తేదీలో రావడం కుదరలేదు.
ఈ ఒక్క సినిమా కూడా పడి ఉంటే మాత్రం తెలుగులో సినిమాలో మే 9 మరింత ప్రత్యేకంగా నిలిచిపోయి ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ మరింత ఆసక్తికర విషయాలు ఏమిటంటే అశ్వనీదత్ నుంచి వచ్చిన సినిమాలు ఆల్రెడీ రెండు (మహానటి, జగదేక వీరుడు అతిలోక సుందరి) ఉండగా ఇప్పుడు కల్కి మిస్ అయ్యింది. అలాగే ఇదే తేదీలో కమల్ నటించిన ఇండియన్ సినిమా రాగా, ఇదే కల్కి సినిమాలో కూడా కమల్ హాసన్ నటిస్తుండడం గమనార్హం. కొంచెం టైం బ్యాడ్ కానీ ఈ డేట్ లో కల్కి పడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది ఏమో..