మంచు వారి యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా ఇండియన్ సినిమా దగ్గర భారీ మల్టీ స్టారర్ లా తెరకెక్కిస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ చిత్రం “కన్నప్ప”. మరి ఎన్నో అంచనాలు నడుమ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దీనిని తెరకెక్కిస్తుండగా ఈ సినిమా విషయంలో విష్ణు ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ ని అందిస్తూ వస్తున్నాడు.
అలా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ కన్నప్ప సెట్స్ లోకి అడుగు పెట్టినట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అప్డేట్ అందించాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ఉన్నాడు అనే టాక్ వచ్చినప్పుడు నుంచే అతడు మహా శివునిగా కనిపిస్తాడు అని రూమర్స్ వచ్చాయి. అయితే తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఎంట్రీతో ఇది మారింది.
ఇక్కడ నుంచి శివుని పాత్రలో అక్షయ్, నందీశ్వరునిగా ప్రభాస్ కనిపిస్తారు అని మరో వెర్షన్ వచ్చింది. అయితే తాజాగా వచ్చిన ప్రభాస్ పోస్టర్ చూస్తే మాత్రం ఇదంతా మారేలా అనిపిస్తుంది. తన కట్టు, అదంతా చూస్తుంటే శివుని పాత్రలో ప్రభాస్ నే కనిపించే ఛాయలు కనిపిస్తున్నాయి. దీనితో మరోసారి ప్రభాస్ పాత్ర విషయంలో మళ్ళీ ఆసక్తి మొదలైంది. మరి చూడాలి విష్ణు ఎవరెవరికి ఎలాంటి పాత్రలు ప్లాన్ చేసాడో అనేది.