టాలీవుడ్ లో ప్రస్తుత యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి యువతలో ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లో అడుగు పెట్టి 50 కోట్లకి పైగా మార్కెట్ ని ఇప్పుడు తాను సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ సక్సెస్ లో ఉన్నపుడు భారీ ఫేమ్ ని అందుకున్నాడు అలాగే నెగిటివ్ కూడా తనపై వచ్చింది.
కానీ ఇప్పుడు మాత్రం తన హిట్ స్ట్రీక్ కి కొంచెం బ్రేక్ పడింది. లైగర్ నుంచి ఇపుడు ఫ్యామిలీ స్టార్ వరకు తన నుంచి మళ్ళీ తన రేంజ్ హిట్ పడలేదు. దీనితో తన ఫ్యాన్స్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుండగా ఈరోజు తన పుట్టిన రోజు కానుకగా అనౌన్స్ చేసిన లైనప్ తో విజయ్ తన కెరీర్ లోనే ఒక కసితో కూడిన లైనప్ అన్నట్టు ఇది అనిపిస్తుంది.
జస్ట్ అనౌన్సమెంట్ లతోనే విజయ్ ఆల్రెడీ హిట్ కొట్టేసాడు అన్న రేంజ్ లో వైబ్స్ కనిపిస్తున్నాయి. వీటితో తాను మాత్రం దెబ్బ తిన్న కొద్దీ రాటుదేలుతున్నాడు తప్పితే అసలు తగ్గేలా ఎక్కడా అనిపించడం లేదు. ఇప్పుడు తన నుంచి రానున్న ఈ పర్టిక్యులర్ మూడు సినిమాలపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.