ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హిట్ 2”.!

Published on Jan 6, 2023 8:00 am IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. దర్శకుడు శైలేష్ నుంచి వస్తున్న తన హిట్ ఫ్రాంచైజ్ లో రెండో సినిమా ఇది కాగా ఈ చిత్రం మొదట సినిమా కన్నా ఎక్కువ హిట్ అయ్యింది. మరి థియేటర్స్ లో సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యిపోయింది.

ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈరోజు నుంచి ఈ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఇంతకుముందు ఎవరైనా మిస్ అయ్యిన వాళ్ళు ఉంటే ఈసారి ప్రైమ్ వీడియో లో చూడవచ్చు. మరి ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించగా తాను కూడా ఈ చిత్రంలో సర్కార్ అనే పవర్ ఫుల్ క్యామియో రోల్ లో కనిపించి సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :