వన్ మిలియన్ క్లబ్ వైపుగా అడివి శేష్ “హిట్2”

వన్ మిలియన్ క్లబ్ వైపుగా అడివి శేష్ “హిట్2”

Published on Dec 11, 2022 3:00 PM IST

టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ఇటీవలి హిట్ మూవీ హిట్ ది సెకండ్ కేస్ బాక్స్ ఆఫీస్ వద్ద, ముఖ్యంగా USA లో మంచి వసూళ్లను సాధిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక గా నటించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరడానికి చాలా దగ్గరలో ఉంది.

బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను సాధించింది. శేష్‌కి ఇది వరుసగా 6వ హిట్ మూవీ. రావు రమేష్, కోమలి ప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు