‘పూరి’కి రీట్వీట్ చేసిన స్టార్ క్రికెటర్ !

‘పూరి’కి రీట్వీట్ చేసిన స్టార్ క్రికెటర్ !

Published on May 10, 2020 3:57 PM IST

Puri Jagannadh

స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్, పోకిరి సినిమాలోని మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ “నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అనే డైలాగ్ ను వార్నర్ తన శైలిలో చెప్పి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పైగా గెస్ ద మూవీ అని నెటిజన్లకు ఛాలెంజ్ కూడా చేశాడు వార్నర్. అయితే వార్నర్ కి పూరి ట్విట్టర్ లో రీట్వీట్ చేస్తూ.. ‘ డేవిడ్‌ ఇది మీరు. మీ ఆవేశానికి మీ పట్టుదల అండ్ దూకుడుకు ఈ డైలాగ్ మీకు కరెక్ట్ గా సరిపోతుంది. మీరు నటుడిగా కూడా అద్భుతంగా ఉన్నారు, మీరు నా చిత్రంలో అతిధి పాత్ర చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ పూరి పోస్ట్ చేశాడు.

దానికి వార్నర్ ట్వీట్ చేస్తూ.. ‘ ప్రయత్నిస్తాను సర్, అయితే సన్‌ రైజర్స్ విడుదల చేసేవాటిని మీరు చూడవలసి ఉంటుంది అంటూ వార్నర్ పూరికి రీట్వీట్ చేశాడు. వార్నర్, ఇటీవలే టిక్ టాక్ లో బుట్టబొమ్మ సాంగ్ కి తన భార్యతో కలిసి డ్యాన్సులు వేసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు కెప్టెన్‌ గా ఉన్న వార్నర్‌ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం బాగుంది. లాక్ డౌ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఈ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.

తాజా వార్తలు