“ఫైటర్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన హృతిక్ రోషన్!

Published on Aug 13, 2021 9:50 pm IST

హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకునే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. ఈ చిత్రం సిద్దార్థ్ ఆనంద్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ ను తాజాగా ప్రకటించడం జరిగింది. జనవరి 2023 లో రిపబ్లిక్ డే వీకెండ్ కి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలపడం జరిగింది. దీపికా పదుకునే మరియు హృతిక్ రోషన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకూ ఎన్నో వార్తలు రాగా, తాజాగా వచ్చిన రిలీజ్ డేట్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ రోషన్ విక్రమ్ వేద రీమేక్ లో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2022 అక్టోబరు కి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :