భారీ బడ్జెట్ తో మహేష్ 26 !

Published on Sep 6, 2018 8:55 am IST

‘భరత్ అనే నేను’ చిత్రంతో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం మహేష్ 26వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు అని తెలిసిందే. ‘ రంగస్థలం’ తో మైత్రి మూవీ మేకర్స్ కు సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సుక్కు మళ్ళీ ఆ బ్యానర్ లోనే మహేష్ సినిమాను తెరకెక్కించనున్నాడు. కాకపోతే ఈ సారి బడ్జెట్ చాలా ఎక్కువ. సుమారు 150కోట్ల తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.

ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషయన్స్ ను రంగంలోకి దించుతున్నారట. త్వరలోనే ఈచిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు వెలుబడనున్నాయి. ఇక ఇంతకుముందు సుక్కు , మహేష్ కాంబినేషన్లో ‘వన్ నేనొక్కడినే’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :