అల్లు అర్జున్ “పుష్ప” పై మరింత పెరుగుతున్న అంచనాలు!

అల్లు అర్జున్ “పుష్ప” పై మరింత పెరుగుతున్న అంచనాలు!

Published on Jul 19, 2021 2:01 AM IST

Pushpa 1

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రానికి లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో చిత్ర యూనిట్ విడుదల చేసిన అనంతరం నుండి సినిమా పై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి ఇంట్రడక్షన్ వీడియో వరకూ అన్ని మాస్ విశ్వరూపాలే. అయితే ఇప్పటికే ఇంట్రడక్షన్ వీడియో ఊహించని రీతిలో 77 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 420 కే కామెంట్స్ తో చర్చకు ఆసక్తి నెలకొంది.

అయితే అల్లు అర్జున్ వరుస సినిమాలు కేవలం తెలుగు సినీ పరిశ్రమ కి మాత్రమే కాకుండా మిగతా బాషల్లో సైతం క్రేజ్ ను సొంతం చేసుకుంటుంది. పుష్ప చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి వార్త సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్న నేపథ్యం లో అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ నెలల్లో విడుదల కి గతం లో అనౌన్స్ చేసినా, తాజాగా తేదీ మారనుంది. దీని పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు