ఇండియన్ బాక్సాఫీస్ వద్ద “లైగర్” సత్తా చాటనున్నాడా?

Published on Aug 9, 2022 2:00 am IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడం, ఇద్దరికీ కూడా తొలి పాన్ ఇండియా మూవీ కావడం తో దేశ వ్యాప్తంగా సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ను ఆగస్ట్ 25, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తోంది. టీమ్ రెస్పాన్స్ పొందుతున్న తీరు చూస్తుంటే లైగర్ కి మంచి హైప్ క్రియేట్ అయ్యింది అని చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాకు మంచి టాక్ వస్తే మేకర్స్ వెనుదిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. విజయ్ చేస్తున్న ప్రమోషన్స్, అతను రిసీవ్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ప్రేక్షకుల గుండెల్లో అతడికి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్లు గా వసూళ్లను రాబడుతుందో, లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :