“పుష్ప 2” ఓటిటికి భారీ రేటు.!

“పుష్ప 2” ఓటిటికి భారీ రేటు.!

Published on Apr 1, 2023 7:20 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్” కోసం తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయ్యిన పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే కానుకగా ఓ భారీ అప్డేట్ రానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఇక ఇప్పుడు అయితే ఈ సినిమా ఓటిటి డీల్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. ఈ సినిమాకి ముందు నుంచి కూడా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్టుగా బజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి వారికి అయితే మేకర్స్ భారీ మొత్తంలో 200 కోట్ల మేర రేట్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ డీల్ అయితే ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు