‘గౌతమిపుత్ర..’కు భారీ ప్లాన్స్ వేసిన బాలయ్య!
Published on Dec 25, 2016 6:17 pm IST

Gautamiputra-Satakarni
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రేపు తిరుపతిలో అంగరంగ వైభవంగా ఆడియో వేడుక జరుపుకోనుంది. ఇందుకోసం టీమ్ ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేసింది. అదేవిధంగా అభిమానులంతా ఇబ్బందులు పడకుండా పక్కాగా ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

ఆడియో రిలీజ్ ప్లాన్స్ ఇలా ఉంటే, సంక్రాంతికి విడుదలవుతోన్న సినిమా కోసం కూడా ఇప్పట్నుంచే భారీ ప్లాన్స్ చేస్తున్నారట. సుమారు 800కు పైగా థియేటర్లలో సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రియా హీరోయిన్‌గా నటించారు. శాతకర్ణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఈమధ్యే విడుదలైన ట్రైలర్ ఇప్పటికే అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

 
Like us on Facebook