‘కాటమరాయడు’కు ఆడియో వేడుక లేదట ?
Published on Feb 21, 2017 8:36 am IST


పవర్ స్టార్ పావన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ మార్చి నెలాఖరుకు విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఆడియో వేడుక నిర్వహించడంలేదని, ఒక్కో పాటను ఆన్ లైన్ లో విడుదల చేసి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారాని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ ‘సరైనోడు’, రామ్ చరణ్ ‘ధృవ’, చిరంజీవి ‘ఖైదీ’ సినిమాలు ఆడియో వేడుక నిర్వహించకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాయి.

అలా చేసిన ఆ చిత్రాలన్నీ ఘన విజయం సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెంటిమెంట్ గా మారిపోయింది. అందుకే ధరమ్ తేజ్ తన ‘విన్నర్’ చిత్రానికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి విడుదలకు సిద్ధమయ్యారు. అందుకే పవన్ చిత్రానికి కూడా ఇలానే చేయాలనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై నిర్మాతల నుండి గాని, పవన్ నుండి గానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ‘గోపాల గోపాల్’ ఫేమ్ డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళ ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది.

 
Like us on Facebook