స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కి భారీ రెస్పాన్స్!

Published on Dec 16, 2021 6:49 pm IST


ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చిత్రం భారత్ లో కూడా విడుదల అయ్యింది. ఈ చిత్రం భారీ ఆక్యుపెన్సీ ను సొంతం చేసుకుంది. మార్వెల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న స్పైడర్ మ్యాన్ చిత్రం దేశ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది.

మొదటి షో నుండి భారీగా ఆక్యుపెన్సి ఉండటం తో మొదటి రోజు భారీగా వసూళ్లు చేసే అవకాశం ఉంది. అంతేకాక పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం తో భారత్ లో విడుదల అవుతున్న చిత్రాలకి కాంపిటీషన్ ఇస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :