కల్కి కోసం భారీ సెట్ !

Published on Sep 10, 2018 4:06 pm IST

‘గరుడ వేగ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే చిత్రంలో నటించనున్నాడు. తన మొదటి సినిమా ‘అవె’ తో మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో రెండు కోట్ల రూపాయలతో భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.

పీరియాడిక్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాజశేకర్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తో కలిసి రాజశేకర్ కూతుళ్లు శివాని , శివాత్మిక ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈచిత్రంలో రాజశేఖర్ కు జోడిగా ఎవరిని తీసుకుంటారో ఇంకా తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :