పవన్ కళ్యాణ్ కు కోర్టు నుండి సమన్లు !

Published on Jul 4, 2018 12:05 pm IST


నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పరువు నష్టం దావా కేసులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుండి సమన్లు అందాయి. వివరాల్లోకి వెళితే శ్రీరెడ్డి తన తల్లిని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలకు అసహనం వ్యక్తం చేసిన పవన్ ఈ వివాదం ద్వారా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడ లాభ పడ్డారని ఆరోపిస్తూ ట్విట్టర్ మాధ్యమం ద్వారా రాధాకృష్ణ ఫోటోను కూడ షేర్ చేసి ట్వీట్స్ చేశారు.

ఎలాంటి ఆధారలు లేకుండా తనపై ఆరోపణలు చేసి తన ఆంధ్రజ్యోతి సంస్థల ప్రతిష్టకు భంగం కలిగించిన పవన్ కళ్యాణ్ అదే ట్విట్టర్ మాధ్యమం ద్వారా తనకు క్షమాపణలు చెప్పాలని రాధాకృష్ణ పవన్ కు గతంతో లీగల్ నోటీసులు పంపారు. కానీ వాటిపై పవన్ స్పందించకపోవడంతో రాధాకృష్ణ పవన్ పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో జారీ అయిన సమన్లలో ఈ నెల 24 న కోర్టుకు హాజరుకావాలని సివిల్ కోర్టు మూడవ అదనపు చీఫ్ జడ్జి పవన్ ను ఆదేశించారు.

సంబంధిత సమాచారం :