“అఖండ” లో ఆ సీన్ పై హైదరాబాద్ పోలీస్ స్పెషల్ థాంక్స్.!

Published on Jan 23, 2022 2:40 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “అఖండ” ఇప్పుడు ఓటిటి లో కూడా వచ్చి అదరగొడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ సహా ఓటిటి లో ఓ రేంజ్ లో రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాకి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ వారు స్పెషల్ థాంక్స్ చెప్పడం ఆసక్తిగా మారింది.

అయితే ఇది ఎందుకంటే ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. బాలయ్య మరియు ప్రగ్యా జైస్వాల్ ల మధ్య జీప్ లో వెళ్లే సీన్ అయితే అందులో ఒక దగ్గర సడెన్ బ్రేక్ వెయ్యగా ప్రగ్యా ముందు పడే సమయంలో బాలయ్య తన చెయ్యి అడ్డు పెట్టి కాపాడుతాడు. మరి ఇక్కడే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. ఇది సినిమాలో చిన్న మెసేజ్ ఇచ్చినట్టే అప్పుడు అనిపించింది.

మరి దీనిపైనే అవగాహన కల్పించినందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో హీరో బాలయ్య మరియు ఆ సీన్ ని పెట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను లకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ప్రతి ఒకరు కూడా తమ ప్రయాణాల్లో సీట్ బెస్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :