‘చమక్కు.. చమక్కు’ పాట కోసం ఎదురుచూస్తున్నాను – ప్రభాస్

‘చమక్కు.. చమక్కు’ పాట కోసం ఎదురుచూస్తున్నాను – ప్రభాస్

Published on Jan 28, 2018 5:20 PM IST

కొద్దిసేపటి క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్ సాయి ధరమ్ తేజ్ యొక్క ‘ఇంటిలిజెంట్’ చిత్రంలోని మొదటి పాట ‘లెట్స్ డూ’ ను రిలీజ్ చేశారు. పిలవగానే వచ్చి పాటను రిలీజ్ చేసినందుకు వినాయక్, తేజ్ ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పగా ప్రభాస్ మాట్లాడుతూ వినాయక్ గారు చాలా మొహమాటపడుతూ నన్ను సాంగ్ లాంచ్ కి పిలిచారు. అయన ఒక్కమెసేజ్ చేస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే వాడ్ని.

నా లైఫ్లో ‘యోగి’ సినిమాకి ఎంజాయ్ చేసినట్టు ఏ సినిమాకీ ఎంజాయ్ చేయలేదు. ఇక ఈ ‘లెట్స్ డూ’ పాట చాలా బాగుంది. అన్నిటిలోకి నేను ఎక్కువగా ఎదురుచూస్తున్న సాంగ్ ‘చమక్కు చమక్కు’. చిరంజీవిగారి పాటల్లో బెస్ట్ సాంగ్ అది. దాని కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నాను. చిరంజీవిగారు ఆ పాటను చాలా అద్భుతంగా చేశారు. తేజ్ ఎలా చేస్తాడో చూడాలని ఉంది. వినాయక్ గారు బ్లాక్ బస్టర్ తో వస్తున్నారు అంటూ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నారు.

తాజా వార్తలు