జగన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా – రాజశేఖర్

Published on Nov 12, 2019 2:43 pm IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతుందని.. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసే కార్యక్రమాన్ని అమలుచేస్తామని జగన్‌ ప్రకటించడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌ అయింది. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామందే సమర్థిస్తున్నారు. తాజాగా సీనియర్ హీరో డా.రాజశేఖర్ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజశేఖర్ ట్వీట్ చేస్తూ… ‘ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా సరైన నిర్ణయం అని.. ప్రస్తుత కాలంలో జాబ్స్ సంపాధించాలంటే.. సరిగ్గా కమ్యూనికేట్ చేయాలన్నా ఆంగ్లంలో మాట్లాడటం ఏంతో అవసరమన్నారు. ఇంగ్లీష్ సరిగ్గా రానుందువల్లే పై చదువుల్లో, ఉద్యోగాల సాధనలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని.. అయితే మన మాతృ భాష తెలుగును కూడా తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేర్చాలని.. ఏమైనా విద్య మాత్రం ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలని.. ఆ దిశగా ఈ నిర్ణయంతో మొదటి అడుగు పడిందని డా.రాజశేఖర్ పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More