ఇంటర్వ్యూ : అఖిల్ – ఆ సినిమా నుండి చాలా నేర్చుకున్నాను!

అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన రెండో సినిమా హలో. ఇటివల విడుదలైన ఈ సినిమాకుకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా అఖిల్ తో ఇంటర్వ్యూ

హలో కు రెస్పాన్స్ ఎలా ఉంది ?

చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. నా యాక్టింగ్, డాన్స్ బాగుందని చాలా మంది చెబుతున్నారు. సినిమా విడుదలకు మందు చాలా టెంక్షన్ పడ్డాను సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. రిలీజ్ ముందు రోజు నిద్ర పట్టలేదు. యు ఎస్ నుండి కాల్ రాగానే హ్యాపీ గా ఫీల్ అయ్యాను. సినిమా అన్ని చోట్లా మంచి టాక్ తో నడుస్తోంది.

సినిమాకు విడుదల తరువాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరినుండి అందుకున్నారు ?

సినిమా రిలీజ్ అయ్యాక ఒక అమ్మాయి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు బాగున్నాయని చెప్పడంతో ఆనందమేసింది. అన్న చైతూ కూడా నా నటన బాగుందని మొదటి సినిమాకు ఈ సినిమాకు చాలా ఇంప్రూ అయ్యవని మెచ్చుకున్నాడు.

ఈ సినిమా కోసం హోమ్ వర్క్ ఏం చేశారు ?

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలిశాక కొన్ని నెలలు బాబ్ బోర్న్ అనే స్టంట్ మాస్టర్ దగ్గర స్టెంట్స్ నేర్చుకున్నాను. శిక్షణ తీసుకోవడం వల్ల షూటింగ్ సమయంలో ఈజీ అయ్యింది.

ఈ సినిమా కోసం పాట ఎందుకు పాడాలనిపించింది ?

నేను అనూప్ కలిసి మాట్లాడుకునేవాళ్ళం, మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చునేవాన్ని ఆ సమయంలో అనూప్ కొన్ని లైన్స్ పాడమని చెప్పాడు. నా గొంతు విని నాచేత ఆ పాట పాడించాడు అనూప్.

ఈ సినిమా కోసం మీ నాన్న గారు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ?

ఆయన నాకు తండ్రి కంటే ఎక్కువ. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడ్డాడు. ప్రీ ప్రొడక్షన్ లో అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఆయన సపోర్ట్ మరువలేనిది. అమ్మ కూడా బాగా కేర్ తీసుకొని హెల్ప్ చేసింది.

అఖిల్ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగింది ?

నేను వినాయక్ గారు చాలా డిస్కస్ చేసుకున్నాం కానీ ఎక్కడో తప్పు జరిగింది. ఆ సినిమా నుండి చాలా తెలుసుకున్నాను. సినిమాకు కథ చాలా ముఖ్యమని అర్థం అయ్యింది.

ఎలాంటి దర్శకులతో పని చెయ్యాలని అనుకుంటున్నారు ?

తెలుగు దర్శకులతోనే సినిమాలు ఎక్కువ చేస్తాను. హిందీ సినిమాలు ఎక్కువ చూస్తాను. బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అంటే ఇష్టం. కొత్త కథలతో వచ్చే న్యూ డైరెక్టర్స్ తో పనిచేయాలని ఉంది.