ఇంటర్వ్యూ : సీరత్ కపూర్ – నా పాత్ర హీరోనే డామినేట్ చేస్తుంటుంది

ఇంటర్వ్యూ : సీరత్ కపూర్ – నా పాత్ర హీరోనే డామినేట్ చేస్తుంటుంది

Published on Jan 26, 2018 5:20 PM IST

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’ ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర హీరోయిన్లలో ఒకరైన సీరత్ కపూర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ?
జ) ఇందులో నా పాత్ర భిన్నంగా ఉంటుంది. హీరోనే డామినేట్ చేస్తుంటాను. హీరోకి ఏం చేయాలో చెప్తుంటాను.

ప్ర) రవితేజలాంటి పెద్ద హీరోతో చేయడం ఎలా ఉంది ?
జ) చాలా హ్యాపీగా ఉంది. ‘రన్ రాజా రన్’ సక్సెస్ తర్వాత నావి కొన్ని సినిమాలు సరిగా ఆడలేదు. దానికి నేను పెద్దగా బాధపడను. ‘రాజుగారి గది-2’ నుండి మంచి సినిమాలు చేస్తున్నాను.

ప్ర) సెంకడ్ హీరోయిన్ గా నటించడం ఎలా ఉంది ?
జ) అంటే నేను ఇందులో సెకండ్ హీరోయిన్ ని కాదు. ఒక ముఖ్యమైన పాత్ర. నేను సెకండ్ హీరోయిన్ , ఫస్ట్ హీరోయిన్ అని అనుకోను పాత్రలోని ప్రాముఖ్యతను చూస్తాను.

ప్ర) రవితేజగారితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. సెట్స్ లో సరదాగా ఉంటారు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లు ఉన్న తర్వాత అలా ఉండటం మామూలు విషయంకాదు. ఎప్పుడూ ఎనర్జీగా, లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ప్ర) సినిమాలో సోషల్ మెసేజ్ ఏమైనా ఉంటుందా ?
జ) అంటే నేను కూడా ఇంకా పూర్తి సినిమా చూడలేదు. అందుకే ఏమీ చెప్పలేను. ట్రైలర్లో చూస్తే దేశాన్ని కాపాడటానికి ఒక పోలీసాఫీసర్ ఏం చేస్తాడు అనేది కథని తెలుస్తుంది. పోలీసుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా చూపిస్తారు.

ప్ర) మీ పాత్ర సినిమా మొత్తం ఉంటుందా ?
జ) సినిమా మొత్తం ఉండను. ముఖ్యమైన సెకండాఫ్లో వస్తాను. నాకు, రాశీఖన్నాకు కాంబినేషన్ సీన్స్ కూడా ఉండవు.

ప్ర) మీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) రానా దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను. రవికాంత్ పేరెపు డైరెక్టర్. ‘గుంటూరు టాకీస్’ సిద్దు అందులో హీరో.

ప్ర) ఈ సినిమా మీ కెరీర్ కు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారా ?
జ) ‘రన్ రాజా రన్’ చేసినప్పుడు అంత మంచి సక్సెస్ సినిమను చేశానని నేను రియలైజ్ కాలేకపోయాను. ఆ తరవాత కొన్ని సినిమాలు కూడా అంతే. అవి నా కెరీర్ కు ఎంతలా ఉపయోగపడతాయనేది చూడలేదు. కానీ ‘ఒక్క క్షణం’ లాగానే ఈ చిత్రం నాకు బాగా సహాయపడుతుందని చెప్పగలను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు