ఇంటర్వ్యూ : రాశీ ఖన్నా – 17 ఏళ్ల వయసులో నా తొలిప్రేమ మైదలైంది !

ఇంటర్వ్యూ : రాశీ ఖన్నా – 17 ఏళ్ల వయసులో నా తొలిప్రేమ మైదలైంది !

Published on Feb 7, 2018 4:33 PM IST

స్టార్ హీరోయిన్ రాశీఖన్నా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గత వారం ‘టచ్ చేసి చూడు’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ఈ 10వ తేదీన ‘తొలిప్రేమ’తో మన ముందుకురానున్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమా మొత్తం ‘తొలిప్రేమ’ గురించే. ఈ జనరేషన్లో యుక్త వయసులో ఉన్నవారిలో పుట్టిన మొదటి ప్రేమ ఎలా ఉంటుంది, వయసు పెరిగి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్ది అది ఎలా మారుతుంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్.

ప్ర) పవన్ ‘తొలిప్రేమ’కు మీ ‘తొలిప్రేమ’కు ఏమైనా పోలికలున్నాయా ?
జ) లేదు. 8 నెలల క్రితం ఆ సినిమా చూశాను. చాలా బాగుంది. కానీ దానికి దీనికి ఎలాంటి పోలిక ఉండదు. రెండూ పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

ప్ర) ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ప్రేపించిన అంశం ?
జ) నా మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నాకు బాగా నచ్చిన లవ్ స్టోరీ ఇదే. నా మనసుకు బాగా దగ్గరైంది. అందుకే చేశాను. టీజర్, ట్రైలర్ అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పేరు వర్ష. మొత్తం మూడు లుక్స్ లో కనిపిస్తాను. ఒకటి 19 ఏళ్ళ వయసులో ఇంకొకటి లండన్లో, మరొకటి కాలేజ్ రోజుల్లో. చాలా అందమైన పాత్ర. నా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది.

ప్ర) మీ నిజ జీవితానికి ఈ సినిమా ఎలా కనెక్టయ్యింది ?
జ) అంటే నాకు 17 ఏళ్ళ వయసులో ఒక ప్రేమ కథ ఉండేది. నా సీనియర్ నాకు ప్రపోజ్ చేశాడు. అదే నా తొలిప్రేమ. అందుకే ఈ కథ నాకు బాగా దగ్గరైంది.

ప్ర) ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చిన రెస్పాన్స్ ఎలా అనిపించింది ?
జ) చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాలి. ‘తొలిప్రేమ’ అనే టైటిల్ చూసి సెంటిమెంట్ గా మాకు చాలా సపోర్ట్ చేశారు.

ప్ర) వరుణ్ తేజ్ తో వర్క్ ఎలా ఉంది ?
జ) వరుణ్ తేజ్ చెప్పుకోవడంలేదు కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వయసులో చిన్నగా కనబడటానికి రోజుకి మూడుసార్లు జిమ్ కు వెళ్ళేవాడు. సరదాగా ఉంటాడు. అతని క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ప్ర) వెంకీ అట్లూరి ఇది మొదటి సినిమా కదా ఎలా చేశారు ?
జ) చాలా బాగా చేశాడు. ఎక్కడా పొరపాట్లు జరక్కుండా చూసుకుని చాలా ప్రేమతో సినిమాను తీశాడు. సుమారు 2 ఏళ్ళు అతను ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాడు.

ప్ర) ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సీన్ ?
జ) చాలానే ఉన్నాయి. అన్నిటిలోకి కార్ సీన్ బాగా నచ్చింది. ట్రైలర్లో కూడా కనబడుతుంది. చాలా అందమైన, క్యూట్ సీన్ అది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు