వైరల్ పిక్ : పుష్ప మ్యానరిజం స్టైల్ తో ఐకాన్ స్టార్

Published on Feb 22, 2023 12:26 am IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప గుర్తింపు సంపాదించిన సంగతి తెల్సిందే. ఇక ఆమూవీ లోని సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ తో పాటు మరీ ముఖ్యంగా పుష్ప తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఎందరో ఆడియన్స్, ఫ్యాన్స్ మనస్సులో ఎంతో బాగా రిజిస్టర్ అయింది.

దానిపై అనేక రీల్స్ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా పలు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తూ ఉంటాము. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న పుష్ప ది రూల్ షూటింగ్ లో పాల్గొంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేడు తగ్గేదేలే మ్యానరిజం స్టైల్ లో దిగిన ఒక పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ కొద్దిసేపటి క్రితం ఆ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దానిని మరింతగా వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :