పవన్ రీ ఎంట్రీ ఇస్తే చిరు మాదిరి రికార్డు లు ఖాయం

Published on Oct 20, 2019 3:00 am IST

కొద్దిరోజులుగా మళ్ళీ పవన్ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం పై చర్చ నడుస్తుంది. ఆయన మళ్ళీ సినిమాలలోకి రానున్నారని, ఆమేరకు కొందరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల సైరా ప్రొమోషనల్ కార్యక్రమాలలో మరియు అలాగే విజయోత్సవ వేదికలపై పవన్ మూవీ విషయంలో చిరంజీవి, చరణ్ లాంటి వారు ఇచ్చిన సమాధానాలు కూడా ఈ పుకార్లను బలపరిచే విధంగా ఉన్నాయి. పవన్ అసలు సినిమాలు చేయరు అని కుటుంబ సభ్యులే గట్టిగా చెప్పని తరుణంలో పవన్ మళ్ళీ సినిమాలు చేస్తారని కొందరు భావిస్తున్నారు.

ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా మంది మరో మారు ఆయనను తెరపై చూడాలని తహతహ లాడుతున్నారు. ఐతే పవన్ మరో మారు మూవీ చేస్తే మాత్రం రికార్డ్ లు బద్దలు కావడం ఖాయం అని చాలా మంది వాదన. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా వచ్చిన ఖైదీ నంబర్ 150 ఎన్ని రికార్డు లు నెలకొల్పినదో తెలిసిన విషయమే. అలాగే పవన్ మరలా సినిమా చేస్తే ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డు లు తుడిపెట్టడం ఖాయం. మరి పవన్ మూవీ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More