ఎన్టీఆర్,చరణ్ లతో రికార్డుల పోరుకి సిద్ధం అవుతున్న ప్రభాస్

Published on Feb 27, 2020 9:28 am IST

ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మెగా ప్రొడ్యూసర్ అశ్వని దత్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2021 చివరి కల్లా విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. కొన్నాళ్లుగా నాగ అశ్విన్ ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. కాగా గతంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నట్లు అశ్విని దత్ ప్రకటించారు. ఆ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదేనని అర్థం అవుతుంది.

ఐతే 2021లో జనవరి 8న రాజమౌళి భారీ మల్టీ స్టారర్ విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా దాదాపు పది భాషలలో విడుదల కానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే భారీ ప్రీ రిలీజ్ బిసినెస్ జరిపిన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు సాధించడం ఖాయం. కాగా ప్రభాస్-నాగ అశ్విన్ ల కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం సైతం 2021లో విడుదల కానుంది.ఆర్ ఆర్ ఆర్ ఏడాది ప్రారంభంలో విడుదల అవుతుండగా, చివర్లో ప్రభాస్ మూవీ రానుంది. 2021లో ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ మరియు ప్రభాస్ మూవీ మధ్య 2021గానూ కలెక్షన్స్ వార్ నడిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More