దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “ఇండియన్ 2” పాన్ ఇండియా హక్కులు.!

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “ఇండియన్ 2” పాన్ ఇండియా హక్కులు.!

Published on Jan 17, 2024 8:45 PM IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2”. మరి దర్శకుడు శంకర్ మొదటి భాగం కన్నా ఎన్నో రెట్లు భారీగా దీనిని ప్లాన్ చేస్తుండగా షూటింగ్ కూడా రీసెంట్ గానే కంప్లీట్ చేసినట్టుగా తెలిసింది.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఇన్ఫో ఇప్పుడు బయటకి వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమా ఓటిటి డీల్ ఫైనల్ గా లాక్ అయ్యిపోయింది. ఈ సినిమా ఓటిటి హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం మొత్తం పాన్ ఇండియా భాషల్లో డీల్ కుదుర్చుకుంది.

లేటెస్ట్ గా ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు తమిళ్ కి సంబంధించి తమ పండుగ సినిమాలు అంటూ ఒకో సినిమాని రివీల్ చేస్తూ వస్తుండగా ఈ చిత్రాల్లో ఇండియన్ 2 ని కూడా తాము సొంతం చేసుకున్నట్టుగా తెలిపారు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో వచ్చిన తర్వాత అతి త్వరలోనే స్ట్రీమింగ్ కి తీసుకొస్తామని కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు