లేటెస్ట్ : రజినీకాంత్ తో కలిసి నటించనున్న ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్

Published on May 18, 2023 11:20 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ లాల్ సలాం. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఇటీవల ప్రారంభం అయి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రజినీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.

విషయం ఏమిటంటే, ఈ మూవీలో ఒకప్పటి భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. 1983 లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించారు. కాగా ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందాన్నిస్తోందని రజినీకాంత్ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కపిల్ తో కలిసి దిగిన పిక్ ని పోస్ట్ చేస్తూ తెలిపారు. తెలుగు నటి జీవిత రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :