“భీమ్లా నాయక్” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Aug 21, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో “భీమ్లా నాయక్” ఒకటి. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానుంది అని తెలిసిందే.

మరి ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో మళ్ళీ మిస్టరీ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రం ఆ డేట్ కి రిలీజ్ కాదని దానిని మెగాస్టార్ “ఆచార్య” తీసుకోనుంది అని టాక్ ఉంది. కానీ దీనిపై ఇంట్రెస్టింగ్ బజ్ మళ్ళీ వినిపిస్తుంది.

ఈ చిత్రం రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని అనుకున్న సమయానికే వస్తుందని దానిపై క్లారిటీ కూడా రానున్న రోజుల్లో ఉంటుంది అని నయా టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :