హృతిక్ లా సూపర్ హీరో రోల్ ట్రై చేస్తున్న ప్రభాస్..?

Published on Feb 27, 2020 11:03 am IST

ఇండియాలో సైన్స్ ఫిక్షన్ మరియు సూపర్ హీరోల సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. బడ్జెట్ పరిమితుల రీత్యా చాల మంది దర్శకులు ఇలాంటి చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. ఔత్సాహికులు కొందరు పరిమిత బడ్జెట్ లో ఈ తరహా సినిమాలు చేశారు. ఐతే బాలీవుడ్ లో హ్రితిక్ హీరోగా వచ్చిన క్రిష్ సిరీస్ చాల సక్సెస్ అయ్యింది. 2003ల వచ్చిన కోయీ మిల్గయా చిత్రంతో మొదలైన ఈ సిరీస్ 2006లో క్రిష్ 2గా వచ్చింది. ఇక 2013లో క్రిష్ 3 రాగా ఈ మూవీలో కంగనా రనౌత్ మరియు వివేక్ ఒబెరాయ్ విలన్స్ గా చేశారు. కాగా టాలీవుడ్ టాప్ స్టార్ ప్రభాస్ కూడా ఈ తరహా సూపర్ హీరో రోల్ చేస్తున్నారని తెలుస్తున్న సమాచారం.

నిన్న ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సూపర్ నాచురల్ పవర్స్ ఉండే సూపర్ హీరో రోల్ చేస్తున్నారని సమాచారం. దీనిపై స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదే కనుక నిజం అయితే సూపర్ హీరోగా ప్రభాస్ తెరపై హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో రెచ్చిపోవడం ఖాయం.

సంబంధిత సమాచారం :

X
More