తేజ నిజంగా ఆ ఇష్యూ మీద సినిమా చేస్తున్నారా ?

Published on Nov 12, 2019 11:20 pm IST

ఇటీవలే ‘సీత’ సినిమా చేసి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన దర్శకుడు తేజ నెక్స్ట్ సినిమా కోసం ఆసక్తికరమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఆ ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే.. ఆర్టికల్ 370. ఈమధ్య ఆర్టికల్ 370 రద్దు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

కేంద్రం తీసుకున్న ఈ చర్య ద్వారా జమ్మూకశ్మీర్ రెండుగా విడిపోయి అసెంబ్లీలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ అంశం మీద సినిమా చేయాలనే ఆలోచనలో తేజ ఉన్నారనని, ప్రస్తుతం
స్క్రిప్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్నారనే మాటలు వినబడుతున్నాయి. అయితే తేజ నుండి అధికారికంగా ఏ ప్రకటనా వెలువడలేదు.

కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సాధారణంగా ఇలాంటి విషయాల మీద బాలీవుడ్ దర్శకులే ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. మన దక్షిణాదిన ఆ తరహా ప్రయోగాలు చాలా తక్కువ. అలాంటిది తేజ క్లిష్టమైన ఆర్టికల్ 370 రద్దు అంశం మీద సినిమా చేస్తే గొప్పగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి తేజ మనసులో అసలు ఈ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశ్యం ఉందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More