పుష్ప చిత్రం విడుదల పై పెరుగుతున్న ఆసక్తి!

Published on Sep 12, 2021 11:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ను పుష్ప ది రైజ్ పేరిట మేకర్స్ విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను కాకినాడ పోర్ట్స్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ షెడ్యూల్ మరొక వారం పాటు కొనసాగే అవకాశం ఉంది.

ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అనుకున్న సమయం కంటే ముందుగానే డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ దక్కించుకొనే అవకాశం ఉంది.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విలన్ పాత్ర లో ఫాహద్ కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా పతాకాల పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :