చరణ్, శంకర్ ల బిగ్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర ఇన్ఫో.!

Published on Jul 24, 2021 10:27 am IST


ఇటీవల మన సౌత్ ఇండియన్ సినిమా నుంచి అనౌన్స్ కాబడిన పలు భారీ ప్రాజెక్ట్స్ లో పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో అనౌన్స్ కాబడిన భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఆ అనౌన్సమెంట్ తోనే ఎనలేని హైప్ తెచ్చుకున్న ఈ సాలిడ్ కాంబో వచ్చే సెప్టెంబర్ నుంచి మొదలు కావడానికి సన్నద్ధం అవుతుంది.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి రోజులు గడుస్తున్నా కొద్దీ పలు ఆసక్తికర విషయాలే అధికారికంగా మేకర్స్ వెల్లడి చేస్తున్నారు. మరోపక్క మంచి బజ్ లు కూడా వినిపిస్తున్నాయి. మరి అలానే లేటెస్ట్ ఇన్ఫో ఈ సినిమాపై వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

కానీ ప్రస్తుత టాక్ ఏమిటంటే ప్రధానంగా ఈ సినిమా ట్రై లాంగువల్ సినిమాగా తెరకెక్కనుందట. అంటే తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :