“RRR”లో చరణ్, తారక్ రోల్స్ పై మరింత ఆసక్తికర టాక్స్.!

“RRR”లో చరణ్, తారక్ రోల్స్ పై మరింత ఆసక్తికర టాక్స్.!

Published on Jul 22, 2021 5:32 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు భారీ లెవెల్లో ప్రమోషన్స్ ని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రాజమౌళి ప్రతి సినిమాకు కూడా కథను అందించే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారన్న సంగతి తెలిసిందే. మరి ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారానే ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది.

తారక్ మరియు చరణ్ లు ఇద్దరు స్వతంత్ర సమర యోధులు కొమరం భీం, అల్లూరి పత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వారిలో తారక్ రోల్ పై మాట్లాడుతూ అందులో భీం నైజామ్ పోలీసులు నుంచి తప్పించుకునే క్రమంలో తన వేషం మార్చి ఎలా కొనసాగుతాడో అన్న విధంగా ఉంటుందని తెలిపారు.

అలాగే చరణ్ రామరాజు రోల్ విషయానికి వస్తే అసలు తాను ఎందుకు పోలీస్ గెటప్ లో కనిపించాడు? దానికి గల కారణం వెనుక ఉన్న రహస్యం ఏంటి అన్నవి ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది అని తెలిపారు. మరి సినిమాలో వీరి పాత్రలు ఇంకెంత ఆసక్తికరంగా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు