శంకర్, చరణ్ ల బిగ్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర ఇన్ఫో.!

Published on Sep 12, 2021 7:02 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ విజనరీ అండ్ ఐకానిక్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ ల కాంబోలో తమ బెంచ్ మార్క్ 15వ సినిమాను ఇటీవల అధికారికంగా పూజ తో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి భారీ హైప్ తో ఉన్న ఈ సినిమాకి కాస్ట్ అండ్ టెక్నీకల్ క్రూ ని అనౌన్స్ చేసేసిన శంకర్ త్వరలోనే రెగ్యులర్ షూట్ ని షురూ చేయనున్నాడు.. మరి ఇదిలా వుండగా ఈ బిగ్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే.

అయితే ఆల్రెడీ ఒక భారీ సాంగ్ ను కంప్లీట్ చేసేసినట్టుగా శంకర్ కన్ఫర్మ్ చేశారు. మరి థమన్ మరో రెండు సాంగ్స్ ని కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో పాటలు కూడా శంకర్ మార్క్ లోనే ఎక్కువే ఉండనున్నట్టుగా టాక్. అలాగే శంకర్ సినిమాల్లో సాంగ్స్ కి పెట్టే బడ్జెట్ తోనే ఒక మీడియం బడ్జెట్ సినిమాని తీసేయ్యొచ్చు ఆ రేంజ్ లో సాంగ్స్ తీస్తారు మరి ఈ సినిమాకి ఎలాంటి విజువల్స్ చూపనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :