నితిన్ “మాస్ట్రో”పై ఇంట్రెస్టింగ్ ఇన్‌ఫర్‌మేషన్..!

Published on Jul 20, 2021 2:41 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్ పర్పస్ కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇందులోని నటీనటులంతా పాల్గొనేలా ప్లాన్ చేసి ఆ పాటను చిత్రీకరించారట. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించినట్టు సమాచారం. అయితే ఇప్పటికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :