అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయా?

Published on Dec 7, 2019 8:15 am IST

బన్నీ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 2020జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా థమన్ అందించిన సాంగ్స్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా విపరీతంగా నచ్చేశాయి. త్వరలో ఈ మూవీ టీజర్ విడుదల కానుంది. కాగా అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ప్రఖ్యాత డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సన్ నెట్ వర్క్ అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుందట. దీనికి సంబంధించి డీల్ కూడా పూర్తయిందని తెలుస్తుంది.

దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న వార్త. అల వైకుంఠపురంలో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More