మరోసారి తెరపైకొచ్చిన శ్రియ పెళ్లి వ్యవహారం !
Published on Feb 27, 2018 4:27 pm IST

సీనియర్ నటి శ్రియ శరన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే వార్త కొద్దిరోజుల క్రితమే బయటికొచ్చినా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం వాటిలో ఏమాత్రం వాస్తవంలేదని కొట్టిపడేశారు. కానీ ఇపుడు తాజాగా ఈ విషయం మరోసారి తెరపైకొచ్చింది. ఈసారి మాత్రం శ్రియ వివాహం చేసుకోబోతోందనే వార్తలు జాతీయ మీడియాలో చాలా బలంగా వినిపిస్తున్నాయి.

వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రియ రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రై ఖొస్చీవ్ ను వివాహం చేసుకోనుందని, మార్చి 17, 18, 19 తేదీల్లో మూడు రోజులపాటు ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి వేడుక జరగనుందని అవగతమవుతోంది. మరి ఇప్పటికైనా శ్రియ వ్యక్తిగతమంటూ విషయాన్ని దాటవేయకుండా క్లారిటీ ఇస్తే ఈ వార్తలు నిజమో కాదో తేలిపోతోంది.

 
Like us on Facebook