పూరి,దేవరకొండను ఫైటర్ గా మార్చనున్నాడా?

Published on Aug 22, 2019 12:33 pm IST

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాద్ ఐ యామ్ బ్యాక్ అని నిరూపించుకున్నారు. ఆ విజయం ఇచ్చిన ఆనందంలో పూరి ఇటీవల ఓ కొత్త మూవీ ప్రకటన కూడా చేశేశారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఓ చిత్రం చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఐతే ఈ తాజా చిత్ర టైటిల్ కూడా నిర్ణయించేశారని ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త.

పూరి ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఫైటర్ టైటిల్ చాలా బాగుంటుందని భావిస్తున్నాడట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ సినీ వర్గాలలో పుకారు షికారు చేస్తుంది.ఈ ఏడాది డిసెంబర్ కి ఈ చిత్రం సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :