‘వాల్తేరు వీరయ్య’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

‘వాల్తేరు వీరయ్య’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Nov 14, 2022 7:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వినిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందట. మెగాస్టార్ ఎనర్జిటిక్ ఫైట్స్ విజిల్స్ వేయిస్తాయని, ముఖ్యంగా ఈ సీక్వెన్స్ లో రవితేజ – చిరంజీవి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా హార్ట్ టచింగ్ అని తెలుస్తోంది.

ఇక ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కొట్టిన ఆర్ఆర్ మైండ్ బ్లోయింగ్ అని తెలుస్తోంది. పైగా ఈ సీక్వెన్స్ లోనే రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట. కాగా ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు