ఇంట్రస్టింగ్ అప్ డేట్ తో ‘ఎంత మంచివాడవురా’ ?

Published on Dec 25, 2019 9:05 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. కథలో హీరో తనకు తెలియకుండానే విలన్స్ కి మంచి చేస్తాడట, దాంతో కొన్ని సమస్యలు వస్తాయని.. ఆ సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేసాడనేది సినిమా కథ అని తెలుస్తోంది.

ఇక ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 5న లేదా జనవరి 6న జరిగే ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More