సాహోలో శ్రద్ద కపూర్ రోల్ గురించి ఇంటరెస్టింగ్ అప్డేట్


బాహుబలి ఘన విజయం తరువాత జాతీయ స్థాయిలో పెరిగే క్రేజ్ తో ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గ కూడా ఈ చిత్రం దాదాపు 150 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ చిత్ర సెట్స్ లో జాయిన్ అయింది.

కాగా ఈ చిత్రంలో శ్రద్ద పాత్ర గురించి ఆసక్తి కరమైన వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రద్ద డ్యూయెల్ రోల్ లో కనిపించనుందట. ప్రభాస్ కు హీరోయిన్ గా ఓ పాత్రలో కనిపిస్తే, మరో పాత్రలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ న్యూస్ పై అధికారికంగా ప్రకటన రావలసి ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.