“పుష్ప ది రూల్” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Feb 8, 2022 8:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ సాలిడ్ హిట్ అయ్యింది. అయితే మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి ముందు నుంచి అందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ముగిసేసరికి రెండో భాగం “పుష్ప ది రూల్” పై అయితే మంచి ఆసక్తి ఇప్పుడు నెలకొంది.

మరి ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా తాలూకా మ్యూజిక్ సెషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారట. అంతే కాకుండా దేవిశ్రీ ప్రసాద్ ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ ట్యూన్స్ అందిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే మేకర్స్ వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా నయా టాక్. మరి ఈ భాగం ఎలా ఉంటుందా అని చూడాలి.

సంబంధిత సమాచారం :