శ్రీకరంలో శర్వా రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.

Published on Aug 24, 2019 10:31 am IST

ఇటీవల రణరంగం చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా అలరించారు శర్వానంద్. ఆయన ప్రస్తుతం సమంత జోడిగా తెరకెక్కుతున్న96 షూటింగ్ లో పాల్గొంటున్నారు. 50 శాతానికిపైగా ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయ్యిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించడం జరిగింది. ఐతే దీని తదుపరి శర్వా ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించనున్నారు. ఆయన గతంలో చేసిన శతమానం భవతి మూవీ తరహాలో సాగే ఈ చిత్రం పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

శ్రీకరం అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా, కిషోర్ రెడ్డి నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐతే ఈ చిత్రంలో శర్వా రైతుగా కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలలో విశేషంగా వినిపిస్తున్న వార్త. ఎప్పుడూ లవర్ బాయ్ పాత్రలు చేసే శర్వా మొదటిసారి రైతుగా కనిపించనున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :