ఆ సినిమా పై ప్లాప్ సినిమాల ప్రభావం !

Published on Feb 25, 2020 12:45 am IST

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీకారం’. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశ షూటింగ్ జరుగుతోంది. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు బిజినెస్‌ ఆశించిన స్థాయిలో జరగట్లేదట. శాటిలైట్‌, డిజిటల్ రైట్స్‌ విషయంలో త‌క్కువ ధ‌ర‌కు అడుగుతున్నారట. శ‌ర్వానంద్ గ‌త చిత్రాలు ప‌డిప‌డిలేచె మ‌న‌సు, ర‌ణ‌రంగం, జాను సినిమాలు నిరాశ‌ పరిచే సరికి.. ఆ సినిమాల ప్రభావం శ్రీకారం మీద పడినట్టు ఉంది.

కాగా కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో వ్య‌వ‌సాయం ప్రధానంగా సాగే క‌థాంశంతో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఏప్రిల్ 24న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వాళ్లు నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది. ఆ సినిమాకు అద్భుతమైన బాణీలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్ ఈ మూవీకీ వినసొంపైనా బాణీలు కడుతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :