మల్టీస్టారర్ లో నటించబోతున్న ఎనర్జిటిక్ హీరో !

Published on Sep 11, 2018 8:36 am IST

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలవ్వడానికి శరవేగంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. కాగా ‘హలో గురు ప్రేమ కోసమే’ లో కామెడీ హైలెట్ అవ్వనుందట. ఈ చిత్రంతో రామ్ మళ్ళీ హిట్ కొట్టడం ఖాయం అని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

తాజా సమాచారం ప్రకారం, రామ్ తన తర్వాత సినిమా మల్టీస్టారర్ గా రాబోతుంది. ఓ తమిళ్ స్టార్ తో రామ్ కలిసి నటించనున్నారు. అయితే ఆ హీరో ఎవరనేది ఇంకా తెలియ లేదు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోరే ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నారు.

ఇక హలో గురు ప్రేమ కోసమే లో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :