విజయ్ “బీస్ట్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.!

Published on Aug 19, 2021 2:20 pm IST


ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “బీస్ట్”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక కీలక షెడ్యూల్ ని శరవేగంగా పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కూడా ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం నుంచి రెండు కీలక అప్డేట్ రానున్నట్టుగా టాక్. మొదటగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక అధికారిక పోస్టర్ తో క్లారిటీ ఇవ్వనున్నారట. అలాగే అది బీస్ట్ థర్డ్ లుక్ కూడా కావచ్చని తెలుస్తుంది.

అలాగే మరో బజ్ ఏమిటంటే ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ అని తెలుస్తుంది. అనిరుద్ సంగీతం ఇస్తున్న ఈ ఫస్ట్ సింగిల్ బహుశా దీపావళి కానుకగా రావచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసం పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :